Hyderabad, ఏప్రిల్ 26 -- సమ్మర్ హాలీడేస్ వచ్చేశాయి. ఇక పిల్లలు ఆటలు అంటూ తిరగడమే కాకుండా తల్లిదండ్రులను తెగ విసిగించేస్తారు. అయితే, చిచ్చర పిడుగులు అయిన పిల్లల్లో స్ఫూర్తి నింపేలా, ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు బెస్ట్ ఆప్షన్ సినిమాలు. మరి పిల్లలకు స్ఫూర్తినిచ్చే ఆరు ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2010లో హిందీ భాషలో వచ్చిన మెల్ల డ్రామా చిత్రం ఉడాన్. విక్రమాదిత్య మోత్వానే కథ, దర్శకత్వం అందించిన ఈ సినిమా 17 ఏళ్ల రోహన్ అనే బాలుడు చుట్టూ తిరుగుతుంది. రోహన్‌ అర్ధరాత్రి ఫ్రెండ్స్‌తో చేసిన ఓ పనికి హాస్టల్ నుంచి ఇంటికి పంపించేస్తారు.

17 ఏళ్ల వయసులో అబ్బాయిల్లో వచ్చే మార్పులు, తమ్ముడు, తల్లిదండ్రులతో మెలిగే తీరుతో ఉడాన్ తెరకెక్కించారు. ఐఎమ్‌డీబీ నుంచి 10కి 8.1 రేటింగ్ సాధించిన ఉడాన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ భాషల...