Hyderabad, ఏప్రిల్ 25 -- ఓటీటీలో ఎంత చూసిన తరగనంత కంటెంట్ ఉంటోంది. అందులో జానర్ కు అనుగుణంగా కూడా సినిమాలు ఉన్నాయి. వీటిలో డ్యాన్స్ ఆధారంగా తీసిన మూవీస్ కూడా ఉంటాయి. ఈ మూవీస్ మీ పిల్లలకు డ్యాన్స్ పై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతాయనడంలో సందేహం లేదు. మరి ఆ సినిమాలేంటి? ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయో చూడండి.

తెలుగులో 2006లో వచ్చిన మూవీ స్టైల్. లారెన్స్ రాఘవ నటించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమా డ్యాన్స్ పై ఉన్న గౌరవాన్ని, ఆసక్తిని పెంచుతుంది. ఈ మూవీలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుగాంచిన ప్రభుదేవా కూడా నటించారు. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ చూడొచ్చు.

బీ హ్యాపీ ఈ మధ్యే ప్రైమ్ వీడియోలోకి వచ్చిన మూవీ. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్లో నటించిన మూవీ. డ్యాన్సే జీవితంగా భావించే ఓ చిన్నారి, ఆమె కలలను నెరవేర్చడానికి ఎంత వరకైనా వెళ్లే తండ్రి...