భారతదేశం, ఏప్రిల్ 29 -- నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ ఏప్రిల్ 29, మంగళవారం క్యూ 4 ఫలితాలతో పాటు తన వాటాదారులకు శుభవార్త తెలిపింది. అర్హులైన షేర్ హోల్డర్లకు ప్రత్యేక డివిడెండ్, తుది డివిడెండ్, స్టాక్ స్ప్లిట్, బోనస్ షేర్ ఇష్యూలను ప్రకటించింది.

క్యూ 4 ఫలితాలతో పాటు అర్హులైన వాటాదారులకు భారీగా డివిడెండ్ ను కూడా బజాజ్ ఫైనాన్స్ ప్రకటించింది. ఇందులో రూ.44 తుది డివిడెండ్, రూ.12 ప్రత్యేక మధ్యంతర డివిడెండ్ ఉన్నాయి. మొత్తంగా రూ.56 క్యుములేటివ్ డివిడెండ్ ను కంపెనీ ఈ రోజు ప్రకటించింది. మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.44 తుది డివిడెండ్ ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. అంతేకాకుండా, బజాజ్ ఫైనాన్స్ తుది డివిడెండ్ పొందడానికి అర్హులైన సభ్యులను నిర్ణయించే రికార్డు తేదీని మే 30...