Hyderabad, మే 21 -- అందమైన నవ్వుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అలా నవ్వాలంటే దంతాలు తెల్లగా ఉండాలి. అదే పసుపు రంగులో ఉన్న దంతాలతో ఎంత నవ్వినా ఎదుటివారికి అంతవిహీనంగానే కనిపిస్తాము. కాబట్టి దంతాలపై ఉన్న పసుపు రంగును వదిలించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి.

ఎంతో మంది ఇలా దంతాలు పసుపు రంగులో ఉండే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు బహిరంగంగా నవ్వలేక సంకోచిస్తారు. ఇలాంటి వారికే నిమ్మకాయ అద్భుతమైన ఇంటి నివారణ అని చెప్పవచ్చు. ఈ హోమ్ రెమిడిని పాటించడం కూడా చాలా సులువు.

మీ దంతాలపై పసుపును తొలగించడానికి నిమ్మకాయ ఎంతగా ఉపయోగపడుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ తో పాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. అంటే నిమ్మకాయ బ్యాక్టీరియాను చంపే శక్తిని కలిగి ఉంటుంది. అలాగే మురికిని కూడా తొలగిస్తుంది. కాబట్టి నిమ్...