భారతదేశం, మే 17 -- నేటి జీవనశైలి కారణంగా రోజురోజుకు పెరిగిపోతున్న ఆరోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లకూడదంటే ఒక మంచి ఆరోగ్య బీమా చాలా అవసరం. మరీ ముఖ్యంగా వయస్సు ఎక్కువ ఉన్న సీనియర్​ సిటిజన్లు, తల్లిదండ్రులకు హెల్త్​ ఇన్సూరెన్స్​ కచ్చితంగా ఉండాలి. కానీ, వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య బీమా ప్రీమియం కూడా పెరుగుతుంది. కొత్త పాలసీ తీసుకోవాలనుకుంటే ప్రీమియం చాలా ఎక్కువగా కనిపిస్తుంది! ఈ నేపథ్యంలో సీనియర్​ సిటిజన్ల హెల్త్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

సాధారణంగా సీనియర్ సిటిజన్లు అధిక ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులను తగ్గించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి..

సీనియర్ సిటిజన్ల కోసం మెడిక్లెయిమ్ పాలసీని అందించే అనేక బీమా ప్రొవైడర్లతో, వివిధ ప్లాన్​...