భారతదేశం, జూన్ 19 -- హైలీ బీబర్, బెల్లా హడిడ్ లాంటి సెలబ్రిటీలు చేసే 'క్లీన్ గర్ల్' హెయిర్‌స్టైల్స్ (జుట్టును వెనక్కి దువ్వి, జెల్ పెట్టి నున్నగా కట్టేసుకునేవి, లేదా మెరిసే పోనీటెయిల్స్) అంటే టీనేజర్లు పడిచచ్చిపోతారు. కానీ తలకు నూనె అనగానే మాత్రం ముఖం చిట్లించుకుంటారు. ఇది పూర్తిగా వాళ్ళ తప్పు కాదు లెండి. సోషల్ మీడియా ప్రభావం, పాశ్చాత్య జనాలు చేస్తేనే అది గొప్ప అన్నట్లుగా మన సంప్రదాయ పద్ధతులను కూడా మనం పట్టించుకోకపోవడమే దీనికి కారణం.

సాధారణంగా టీనేజర్లు తల నూనె అంటే జిడ్డుగా, అతుక్కున్నట్లు ఉంటుందని ఇష్టపడరు. నూనె వాడటం వల్ల కలిగే లాభాలు, దాని వెనుక ఉన్న సైన్స్ గురించి వాళ్ళు తెలుసుకుంటే, జుట్టుకు నూనె పట్ల వారి ఆలోచన కచ్చితంగా మారుతుంది.

మారికో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయిన డాక్టర్ శిల్పా వోరా HT లైఫ్‌స్టైల్‌తో మాట్లాడుతూ జుట్...