Hyderabad, ఏప్రిల్ 30 -- మృదువైన జుట్టు త్వరగా రాలదు. ఎందుకంటే అది చిక్కులు పడదు. దువ్వినప్పుడు కూడా స్మూత్ గా అలా దువ్వెన కిందకు జారిపోతుంది. కానీ మిగతా రకాల జుట్టు మాత్రం రాలిపోయే అవకాశం ఎక్కువ. మీ జుట్టు జిడ్డుగా ఉండి త్వరగా చిక్కులు పడుతూ ఉంటే దాన్ని మృదువుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

జుట్టును మృదువుగా మార్చుకునేందుకు తేలికపాటి షాంపూలు, లీవ్ ఇన్ కండిషనర్లు వంటివి అప్లై చేయాల్సి వస్తుంది. అలాగే క్రమం తప్పకుండా ట్రిమ్ కూడా చేస్తూ ఉండాలి. నిద్రపోతున్నప్పుడు జుట్టును పూర్తిగా వదిలేయడం కూడా మంచి పద్ధతి కాదు.

మృదువైన జుట్టు కోసం మీరు మంచి షాంపూను వినియోగించాలి. మీ షాంపుల్లో సల్ఫేట్ లేకుండా చూసుకోండి. ఇలాంటి షాంపూలు తేమవంతంగా ఉంచుతాయి. అలాగే మాయిశ్చరైజింగ్, కండిషన్ కూడా అప్పుడప్పుడు అప్లై చేస్తూ ఉండాలి. దీనివల్ల జుట్టు మృదువుగా మారుతుంది...