Hyderabad, ఏప్రిల్ 9 -- జ్యోతిష శాస్త్రంలాగే రత్నశాస్త్రం కూడా ఉంది. రత్నశాస్త్రం ప్రకారం కొన్ని రత్నాలు కొన్ని గ్రహాలకు అనుబంధంగా ఉంటాయి. గ్రహానికి తగ్గట్టు రత్నాలను ధరించడం వల్ల ఆయా గ్రహాలు ప్రసన్నం అవుతాయని చెప్పుకుంటారు. జాతకంలో గ్రహాల స్థానం ప్రకారం రత్నాన్ని ధరించాల్సిన అవసరం ఉంది.

ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఒక వ్యక్తి జీవితంలో ప్రధానమైన గ్రహం. అతడు మంచి కారకుడిగా ఉంటేనే ఆ వ్యక్తి జీవితంలో సుఖాన్ని, సంపదలను పొందగలడు. అలాగే అందం కూడా ఇచ్చేది శుక్రుడే. సంపద, విలాసం, అందం, ప్రేమకు కారకుడైన శుక్రుడుని ప్రసన్నం చేసుకోవాలంటే మీరు ఏ రత్నాన్ని ధరించాలో తెలుసుకోండి.

శుక్రుడుని బలోపేతం చేసే శక్తి వజ్రానికే ఉంది. వజ్రాన్ని బంగారు ఉంగరంలో పెట్టుకొని వేలికి ధరించడం చాలా శుభప్రదం. ఇలా వజ్రం ధరించడం ద్వారా ఆ వ్యక్తి అన్ని రంగాలలో అనే...