భారతదేశం, డిసెంబర్ 23 -- నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చిన్నపాటి అలసట వచ్చినా పని ఒత్తిడి అనుకుంటాం, కాస్త ఆయాసం వస్తే వయసు పైబడుతోందిలే అని సరిపెట్టుకుంటాం. కానీ, మనం సాదాసీదాగా భావించే ఈ మార్పులే మన గుండె బలహీనపడుతోందనడానికి సంకేతాలు కావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6.4 కోట్ల మందిని వేధిస్తున్న 'గుండె వైఫల్యం' (Heart Failure) గురించి బెంగళూరు మణిపాల్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ హరనహళ్లి కీలక విషయాలను పంచుకున్నారు. మన కళ్లు గప్పి గుండెను దెబ్బతీసే ఆ 5 లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

"గుండె వైఫల్యానికి సంబంధించి అత్యంత సాధారణమైన, మొదట కనిపించే లక్షణం శారీరక శక్తి తగ్గడం. గతంలో సులువుగా చేసిన పనులను కూడా ఇప్పుడు చేయలేకపోవడం, త్వరగా అలసిపోవడం వంటివి కనిపిస్తాయి" అని డాక్టర్ ప్రదీప్ పేర్కొన్నారు. చాలామంది దీనిని వృద్ధాప్...