భారతదేశం, సెప్టెంబర్ 9 -- పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల మన ఊపిరితిత్తులపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. అవి అన్ని రకాల హానికరమైన కాలుష్య కారకాలను భరించాల్సి వస్తోంది. ఫలితంగా, మన శ్వాస వ్యవస్థ (పల్మనరీ సిస్టమ్) ఆరోగ్యంగా ఉండటానికి చాలా కష్టపడుతోంది.

భువనేశ్వర్‌లోని మణిపాల్ హాస్పిటల్‌కు చెందిన పల్మనాలజీ సీనియర్ కన్సల్టెంట్, క్రిటికల్ కేర్ డైరెక్టర్ డాక్టర్ శరత్ బెహెరా మాట్లాడుతూ "పర్యావరణ కారకాల వల్ల ఊపిరితిత్తులు ఒత్తిడికి గురవుతాయి. అందుకే వాటికి సహజమైన మద్దతు అవసరం. శ్వాసకోశ సమస్యలకు వైద్య చికిత్స చాలా అవసరం అయినప్పటికీ, ప్రకృతి మనకు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి కొన్ని అద్భుతమైన దినుసులను అందించింది. పసుపు, అల్లం, వెల్లుల్లి మన వంటగదిలో ఉండే ప్రధానమైన పదార్థాలు. వాటికి ఔషధ గుణాలు ఉన్నట్లు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. ఇవి ఆహారానికి ...