భారతదేశం, మే 31 -- స్మార్ట్​ఫోన్స్​ వాడేకొద్దీ, అవి స్లో అయిపోతుంటాయి. ఇది సహజమైన విషయమే! అయితే ఐఫోన్​లో ఈ పరిస్థితి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఫోన్​ స్లో అయిపోయిన వెంటనే, కొత్తది కొనాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఐఫోన్​ స్లో అయిన వెంటనే కొత్తది కొనాల్సిన అవసరం లేదు. కొన్ని టిప్స్​ పాటిస్తే ఫోన్​ పర్ఫార్మెన్స్​ని పెంచవచ్చు.

ఐఫోన్​ పర్ఫార్మెన్స్​ని పెంచడానికి ఉత్తమైన పరిష్కారం.. 'అథర్​' స్టోరేజ్​ స్పేస్​ని క్లియర్​ చేయడం. ఈ అథర్​ స్టోరేజ్​ స్పేస్​లో సిరీ వాయిస్​, సిస్టెమ్​ ఫైల్స్​, క్యాచీ మెమోరీ స్టోర్​ అయ్యి ఉంటాయి. మరీ ముఖ్యంగా వెబ్​సైట్లు, యాప్స్​కి చెందిన క్యాచీ మెమొరీతో అవి వేగంగా పనిచేసినప్పటికీ, స్టోరేజ్​ స్పేస్​ ఎక్కువ తీసుకుంటాయి. ఇది ఫోన్​ పర్ఫార్మెన్స్​ని తగ్గించేస్తుంది.

సాధారణ సెట్టింగ్​ల నుంచి ఐఫోన్ స్టోరేజ్ ఆప్షన్ ఎంచు...