Hyderabad, మార్చి 19 -- బంగాళదుంపలు తెచ్చాక వారం రోజులు లేదా పది రోజులలోపే వాటిని వండేయాలని. లేకుంటే అవి మొలకెత్తడం ప్రారంభిస్తాయి. అలా మొలకెత్తడం ప్రారంభించాక కూడా ఎంతోమంది వాటిని తీసేసి కూరగా వండుకుంటారు. తెల్ల మొలకలు లేదా ఆకుపచ్చ మొలకలు ఎక్కువగా బంగాళదుంపలపై కనిపిస్తాయి. అయితే ఇలా మొలకలు వచ్చినవి తినడం ఆరోగ్యకరమని ఎంతోమంది అనుకుంటారు. నిజానికి అలా మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఏమాత్రం మంచిది కాదు. ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుంది.

బంగాళదుంపలు పోషకాలు తేమతో నిండి ఉంటాయి. అవి ఎక్కువ కాలం పాటు నిల్వ చేసినప్పుడు ఆ వాతావరణం అవి మొలకెత్తడానికి అనువుగా ఉంటే కాలక్రమేణా చిన్నగా మొలకలు మొదలవుతాయి. దీనికి కారణం బంగాళదుంప లోపల ఉన్న పిండి పదార్థం విచ్ఛిన్న కావడమే. ఆ పిండి పదార్థం విచ్ఛిన్నమై మొలకలు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కొత్తగా మొక్క ఎదగడం బం...