భారతదేశం, జూలై 22 -- రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన సుంకాలు విధిస్తారని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం హెచ్చరించారు. "రష్యా చమురును కొనుగోలు చేసే ప్రజలపై ట్రంప్ సుంకాలు విధించబోతున్నారు. చైనా, భారతదేశం, బ్రెజిల్. ఆ మూడు దేశాలు చౌకైన రష్యన్ చమురులో 80 శాతం కొనుగోలు చేస్తాయి, దాంతో పుతిన్ యుద్ధ యంత్రాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి, అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశాలన్నింటిపై 100 శాతం సుంకం విధించబోతున్నారు, పుతిన్ కు సహాయం చేసినందుకు వారిని శిక్షించబోతున్నారు'' అని గ్రాహం అన్నారు. ఈ మూడు దేశాలు రష్యా లేక అమెరికాల్లో ఏదో ఒక దేశాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

వ్లాదిమిర్ పుతిన్ తనది కాని దేశాలపై దాడి చేయడం ద్వారా మాజీ సోవియట్ యూనియన్ ను పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని గ్రాహం విమర్శ...