Hyderabad, మార్చి 3 -- పెళ్లయిన తర్వాత ప్రతి అమ్మాయి తన తల్లిదండ్రుల ఇంటిని వదిలి అత్తారింటికి వెళ్ళాలి. ఆ కొత్త వాతావరణంలో జీవించేందుకు అలవాటు పడాలి. కొన్నిసార్లు అత్తా కోడళ్లు స్నేహితురాల్లా మారిపోతారు. కానీ కొన్ని ఇళ్లల్లో మాత్రం కోడలికి అత్తకి సరిపడదు. దీనివల్ల ఇల్లు నరకంగా మారిపోతుంది. అ వివాహ జీవితం చేదుగా అనిపిస్తుంది. అత్తగారితో కోడలు తన సంబంధాన్ని మెరుగుపరుచుకుంటే ఆ ఇల్లే స్వర్గంలో ఉంటుంది. కొన్ని సులభమైన చిట్కాల ద్వారా అతను స్నేహితురాలిగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి.

కోపంగా మాట్లాడడం, ప్రతికూలంగా జవాబులు ఇవ్వడం వల్ల సంబంధాలు దిగజారి పోతాయి. మీ అత్తగారు మిమ్మల్ని బాధ పెట్టేలా ఏదైనా అంటే మీరు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆ ప్రశాంతత మీ అత్తగారికి కూడా అర్థమవుతుంది. అలాగే ఇంట్లో ఉన్న ఇతరులు కూడా మిమ్మల్ని గమనిస్తారు. తప్పు ...