భారతదేశం, నవంబర్ 28 -- భారతదేశంలోని ఈ-కామర్స్ సంస్థలలో ఆర్డర్ల పరిమాణం, వార్షిక యూజర్ల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న మీషో (Meesho) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం రంగం సిద్ధమైంది. ఈ ఐపీఓ డిసెంబర్ 3, బుధవారం నాడు ప్రారంభం కానుంది.

ఐపీఓ ప్రారంభానికి ముందే మీషో గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) బలమైన సంకేతాలను ఇస్తోంది. నేడు మీషో ఐపీఓ జీఎంపీ రూ. 29 వద్ద ఉంది. ఈ ఐపీఓ ఇష్యూ ధర గరిష్టంగా రూ. 111గా నిర్ణయించారు. దీనిని దృష్టిలో ఉంచుకుంటే.. ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో ఉన్న ప్రీమియం ప్రకారం, మీషో షేరు ధర సుమారు రూ. 140 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇష్యూ ధర కంటే ఏకంగా 26.13 శాతం అధికం కావడం విశేషం.

మీషో తొలి పబ్లిక్ ఆఫరింగ్ డిసెంబర్ 5, శుక్రవారం నాడు ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు డిసెంబర్ 2న షేర్ల కేటాయింపు జరుగుతుంది.

మీషో ఐపీఓ మొత్తం పరిమా...