భారతదేశం, డిసెంబర్ 22 -- భారతీయ స్టాక్ మార్కెట్లో ఈ నెలలోనే అద్భుతమైన ఎంట్రీ ఇచ్చిన కొత్త తరం ఈ-కామర్స్ దిగ్గజం మీషో (Meesho) షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. శుక్రవారం నాడు రూ. 254.65 వద్ద ఆల్‌టైమ్ హైని తాకిన ఈ స్టాక్, సోమవారం ఉదయం నుంచే పతనం కావడం మొదలైంది. చివరకు 10 శాతం క్షీణించి రూ. 202.05 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకింది. గత రెండు రోజుల్లోనే ఈ షేరు విలువ సుమారు 14 శాతం మేర ఆవిరైపోయింది.

డిసెంబర్ 10న దలాల్ స్ట్రీట్‌లో అడుగుపెట్టిన మీషో ఐపీఓ ధర రూ. 111 కాగా, అది 46 శాతం ప్రీమియంతో లిస్ట్ అయి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. ఒకానొక దశలో ఇది మల్టీబ్యాగర్ స్టాక్‌గా (రెట్టింపు లాభం) అవతరించింది. అయితే, తాజా పతనంతో ఆ హోదాను కోల్పోయినప్పటికీ, ఇప్పటికీ ఐపీఓ ధర కంటే ఈ షేరు 82 శాతం పైనే లాభాల్లో ఉండటం గమనార్హం. ...