భారతదేశం, జనవరి 11 -- మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా రేపు అంటే సోమవారం (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా విడుదలకు ఒక్క రోజు ముందే టికెటింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్‌మైషో' (BookMyShow)లో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు, రేటింగ్స్ సెక్షన్‌ను బుక్‌మైషో నిలిపివేసింది.

ప్రస్తుతం బుక్‌మైషో యాప్‌లో మన శంకరవరప్రసాద్ గారు పేజీని ఓపెన్ చేస్తే.. "కోర్టు ఆదేశాల మేరకు రేటింగ్స్ & రివ్యూలు డిసేబుల్ చేయబడ్డాయి" అనే సందేశం కనిపిస్తోంది. సాధారణంగా సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి ఇది వేదికగా ఉంటుంది. కానీ ఈ సినిమాకు ఆ వెసులుబాటు లేదు. 2 గంటల 44 నిమిషాల నిడివి ఉన్న ...