Hyderabad, మే 11 -- మన శరీరం ఒక యంత్రం లాంటిది. మనం తిన్న ఆహారం అంతా ఒక గొట్టం లాంటి దాని గుండా వెళ్తుంది. దాన్నే పెద్ద ప్రేగు అంటారు. మనం సరిగ్గా తినకపోయినా,కలుషితమైన గాలి పీల్చినా ఈ గొట్టంలో మురికి పేరుకుపోవచ్చు. అలా మురికి పేరుకుపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మంచి విషయం ఏంటంటే మన శరీరం ప్రతి సమస్య గురించి ముందే కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని గమనించి మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే మీలో ఈ 10 రకాల ఇబ్బందులు కనిపించాయంటే మీ పెద్ద ప్రేగులో మురికి పేరుకుపోయిందని, దాన్ని శుభ్రం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థం. ఆ సంకేతాలేంటి, పెద్దప్రేగను ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం రండి.

శరీరంలో బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, ముఖ్యంగా చెడు బ్యాక్టీరియా పెరిగినప్పుడు తీపి పదార్థాలు తినాలనే క...