Hyderabad, జూలై 14 -- ఓటీటీలో వచ్చే కంటెంట్ సాధారణంగా నార్మల్ ఆడియెన్స్‌కు విపరీతంగా నచ్చుతుంది. వారికి ఎన్నో ఓటీటీ మస్ట్ వాచ్ లిస్ట్ ఉంటాయి. అయితే, ఓటీటీ సిరీస్‌తోనే ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్స్‌ కూడా మెచ్చిన వెబ్ సిరీస్‌లు ఉంటే. అవును, ఈ ఓటీటీ హీరోయిన్‌కు మరో ఓటీటీ వెబ్ సిరీస్ విపరీతంగా నచ్చిందంట.

ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు శ్వేత త్రిపాఠి. అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఇప్పటికీ మూడు సీజన్స్‌తో దుమ్ముదులిపిన మీర్జాపూర్ సిరీస్‌లో గోలుగా అదరగొట్టింది శ్వేత త్రిపాఠి. మీర్జాపూర్ రెండో సీజన్ నుంచి హీరోయిన్‌గా అలరిస్తోంది శ్వేత త్రిపాఠి.

అలాంటి శ్వేత త్రిపాఠికి ఓ ఓటీటీ వెబ్ సిరీస్ విపరీతంగా నచ్చేసిందట. ఆ వెబ్ సిరీస్‌లో హారర్, ఎమోషన్, యాక్షన్, ఫాంటసీ, అడ్వెంచర్ వంటి అన్ని రకాల...