Hyderabad, అక్టోబర్ 13 -- "మీరు హీరో మెటిరీయల్ కాదు. కానీ, ఇలా జరగడం హార్డ్ వర్కా లేక అదృష్టమా?" అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా హీరో మెటీరియల్ టాపిక్ వివాదంగా కూడా మారింది. నిజానికి ఇది డ్యూడ్ అనే మూవీ ప్రమోషన్స్‌లో జరిగిన సంఘటన.

లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో అలరించిన డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఇలా అడిగిన ప్రశ్న ఇది. దానికి శరత్ కుమార్ ఘాటుగా, ప్రదీప్ రంగనాథన్ కూల్‌గా తెలివిగా, నిజాయితీగా సమాధానం ఇచ్చారు.

అయితే, ఈ టాపిక్ కాంట్రవర్సీ అవ్వడం, దీనిపై కిరణ్ అబ్బవరం కూడా స్పందించడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్ రియల్ హీరో అంటూ కింగ్ నాగార్జున చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయ...