భారతదేశం, మే 19 -- ప్రేమగా మాటలు కలపుతారు. నెమ్మదిగా డేటింగ్‌కి పిలుస్తారు. చివరికి చీటింగ్ చేస్తారు. మోసాలే లక్ష్యంగా యాప్‌లోని మహిళలు, నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కొన్నిచోట్ల నిలువుదోపిడీకి గురై యువకులు బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు, చదువుకునే విద్యార్ధులే వీరి బార్గెట్.

ఖాళీగా ఉన్నాం కదా... బోర్ కొడుతుందనో.. సరదాగా చాటింగ్‌కు దిగారా? ఇక అంతే సంగతులు. ఒక్కసారి వారి మాయలో పడితే.. రకరకాలుగా టార్చర్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. వైజాగ్‌కు చెందిన ఓ ఇంజనీర్‌కు డేటింగ్ యాప్‌లో ఓ మహిళ పరిచమైంది. తనది హైదరాబాద్ అని పరిచయం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు వీడియో కాల్ వరకు వచ్చారు. అన్నింటినీ ఆమె తన ఫోన్లో రికార్డు చేసింది. ఇక బెదిరింపులకు దిగింది. బంధువులు, స్నేహితులను ట...