భారతదేశం, జనవరి 20 -- మెగాస్టార్ చిరంజీవి, నయనతార లీడ్ రోల్స్ లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలుసు కదా. సంక్రాంతి సినిమాల్లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మంగళవారం (జనవరి 20) సాయంత్రం చిరంజీవి ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ అతడు థ్యాంక్స్ చెప్పాడు.

చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. తెలుగు, ఇంగ్లిష్ లలో ఓ పోస్ట్ చేశాడు. "మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే - నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు" అని చిరు అన్నాడు....