Hyderabad, సెప్టెంబర్ 22 -- బిగ్ బాస్ తెలుగు 9 సందడి కొనసాగుతోంది. బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఈ వారం మనీష్ మర్యాద ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ బజ్ పేరుతో ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలిసిందే. అలా ఈసారి బిగ్ బాస్ తెలుగు 9 బజ్‌కు హోస్ట్‌గా హీరో, సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీ వ్యవహరించారు.

ఇక హౌజ్‌లోకి కామనర్‌గా వచ్చిన మనీష్ మర్యాద బిగ్ బాస్ 8 తెలుగు రెండో వారం ఎలిమినేట్ అయ్యాడు. అతన్ని బిగ్ బాస్ బజ్‌లో హీరో శివాజీ ఇంటర్వ్యూ చేశాడు. "ఫైరు ఎవరు ఫ్లవర్ ఎవరు" అని హౌజ్‌లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ గురించి అడిగాడు శివాజీ. డీమోన్ ఫ్లవర్ అని చెప్పిన మనీష్ "టాప్ 7 మెటీరియల్ కానీ, ఎందుకో ఒక టైమ్‌లో వెళ్లిపోతారని కొడుతుంది కొంచెం" అని చెప్పాడు.

"తన వల్ల గేమ్ ఇప్పటికీ ఇంపాక్ట్ అవ్వలేదు" అని తనూజ గౌడ గురి...