భారతదేశం, ఫిబ్రవరి 19 -- ఆహారానికి మనసుకి సంబంధం ఉంది మీకు తెలుసా? తీవ్రమైన భావోద్వేగాలు, కోపం, ప్రవర్తనలో మార్పులు, వ్యాకులత, యాంగ్జైటీ వంటి అనేక సమస్యలతో మనం తినే తీరులో అనేక మార్పులు వస్తాయి. మహిళలు, పురుషులు, ప్రత్యేకంగా కౌమార దశలోకి వచ్చే పిల్లల్లో ఎక్కువగా ఈ భోజన రుగ్మతలపై అవగాహన కోసమే ఈ కథనం.

దీన్నే ఫ్యాషన్ డిజార్డర్ అని కూడా అంటారు. జీరో సైజ్ అంటూ ఏమాత్రం ఎక్కువ తిన్నా బరువు పెరిగి అందం దెబ్బ తింటుందేమో అన్న సంశయంతో తినడం మానేస్తారు. దాంతో బరువు పూర్తిగా తగ్గి, ఎముకల పోగులా మిగిలిపోతారు. కావాలన్నా ఇక తినలేరు. దీనివల్ల శరీర పోషణ, జీవ క్రియలకు అవసరమైన దానికంటే చాలా తక్కువ మోతాదులో తినడంతో శరీరానికి తగినన్ని పోషకాలు అందకపోవడంతో ఆరోగ్యం క్షీణిస్తుంది.

భోజనం పై అమితాసక్తితో రుచికరమైనవన్నీ తినేస్తారు .ఆ తర్వాత అయ్యో బరువు పెరిగిపోతామే...