Hyderabad, ఏప్రిల్ 19 -- భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిదే. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడం కూడా ఉత్తమ ఆలోచన. అలా అని వర్తమానాన్ని వదిలేసి, గతాన్ని తవ్వుకుంటూ భవిష్యత్తును చూసి భయపడుతూ ఉంటే సంతోషంగా ఎప్పుడు జీవిస్తారు?

గతంలో జరిగిన వాటిని తలుచుకుంటూ వర్తమానాన్ని గడిపేస్తున్నారు. భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచిస్తూ కూడా ఈ క్షణాన్ని దొర్లిపోయేలా చేస్తున్నారు. ఇలా అయితే మీరు ఎప్పటికి సంతోషంగా జీవించలేరు. వర్తమానంలో మీరు చేసిన ప్రతి పని భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. కాబట్టి ఈ క్షణాన్ని సంతోషంగా జీవించేందుకు ప్రయత్నించండి.

వర్తమానంలో జీవించే వారి సంఖ్య వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అందరూ రేపటి గురించి ఆలోచిస్తారు. రేపు ఎలా ఉండాలో ఇప్పుడే ప్రణాళికలు వేసి ఈ క్షణాన్ని వదిలేస్తారు. మరికొందరు గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ వర్తమానంలో బాధ పడ...