Hyderabad, మే 4 -- మీరు నిద్రపోతున్నప్పుడు నవ్వారని మీ కుటుంబ సభ్యుల్లోనో, ఇంకా తెలిసిన వాళ్లెవరైనా చెప్పారా? నిజానికి ఇలాంటి అలవాటు చాలా మందికి ఉంటుందట. పెద్దవాళ్లలో ఇది తక్కువగా కనిపించినా చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇందులో కొద్దిగా సమస్య ఉన్నప్పటికీ ఇది ఎటువంటి హానికరమైన విషయం కాదు. కొన్నిసార్లు స్లీప్ డిజార్డర్ వల్ల, న్యూరాలాజికల్ పరిస్థితి కారణంగానైనా ఇలా జరగొచ్చు.

చాలామంది నిద్రపోతున్నప్పుడు కనురెప్పలను వేగంగా కదిలిస్తుంటారు. దీనినే ర్యాపిడ్ ఐ మూమెంట్ (REM) స్లీప్ అంటారు. అలాంటప్పుడు ఏ వ్యక్తైనా కలల్లో ఉన్నారని అర్థం. ఆ పరిస్థితుల్లో కలలను బట్టి బ్రెయిన్ నవ్వును ప్రేరేపిస్తుందట. "కల బ్రెయిన్ యాక్టివిటీని మెరుగుపరుస్తుందట. అప్పుడే ఎమోషనల్ ఫీలింగ్ కలుగుతుంది. దాంతో సహజంగానే నవ్వుతుంటాం" అని ఫిజీషియన్ డా. తారానాథ్ చెబుతున్న...