భారతదేశం, డిసెంబర్ 28 -- తమిళ సూపర్ స్టార్, రాజకీయ నాయకుడు విజయ్ దళపతి తన చివరి సినిమాగా ప్రచారంలో ఉన్న 'జన నాయగన్' (Jana Nayagan) ఆడియో లాంచ్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మలేషియా వేదికగా జరిగిన ఈ ఈవెంట్‌లో లక్ష మంది అభిమానుల మధ్య మాట్లాడుతూ.. "నాకు కోట (అధికారం) ఇచ్చిన అభిమానుల కోసం సినిమాను వదిలేస్తున్నా" అని ఎమోషనల్ అయ్యాడు.

శనివారం (డిసెంబర్ 27) మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన 'జన నాయగన్' ఆడియో లాంచ్ ఒక చరిత్ర సృష్టించింది. బుకిత్ జలీల్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు ఏకంగా ఒక లక్ష మంది హాజరయ్యారు. ఇది 'మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో కూడా ఎక్కింది. రాజకీయాల్లోకి వెళ్తున్న విజయ్, తన ఫ్యాన్స్ నుద్దేశించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

"నేను సినిమాలోకి వచ్చినప్పుడు ఇక్కడొక చిన్న ఇసుక గూడు కట్టుకుంటున్నా అనుకున్నా. కానీ మీరందరూ ...