Hyderabad, ఏప్రిల్ 17 -- క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుంది. కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచంలోనే క్యాన్సర్ బారిన పడుతున్న వారు అధికంగా ఉన్నారు. మనదేశంలో కూడా క్యాన్సర్ రోగులు రెట్టింపు అవుతూ వస్తున్నారు. ఒక మనిషికి క్యాన్సర్ ఎందుకు వస్తుందో చెప్పడం చాలా కష్టం.

క్యాన్సర్ వారసత్వంగా కూడా రావచ్చు. అలాగే చెడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు తినే ఆహారం అనేది మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మీరు తినే చెడు ఆహారాలు క్యాన్సర్ ను వచ్చే అవకాశాన్ని పెంచితే మరికొన్ని ఆహారాలు తినడం ద్వారా క్యాన్సర్ రాకను అడ్డుకోవచ్చు.

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారాన్ని తినాలో... అలాగే క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను దూరం పెట్టాలో తెలుసుకోండి.

బయట అమ్మే ఆహారాన్ని తినే వారి సంఖ్య అధికంగా ఉంది. ముఖ్యంగా ప్ర...