భారతదేశం, ఫిబ్రవరి 20 -- రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు మారనున్నాయి. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (TAFRC) ప్రతిపాదన ప్రకారం, రాబోయే విద్యా సంవత్సరానికి కనీసం 63 కళాశాలల్లో ట్యూషన్ ఫీజులు పెరుగుతాయి. 70 కళాశాలల్లో ఎటువంటి మార్పులు ఉండవు, 19 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో తగ్గిస్తారు. ఉన్నత విద్యా రంగంలో ఫీజు వసూలును నియంత్రించడానికి, అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(CBIT) రూ.1.83 లక్షలతో అత్యధిక ఫీజును ఖరారు చేశారు. హైదరాబాద్‌లోని జి. నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫీజులను రూ. 62,000 వరకు పెంచుకోవడానికి అనుమతి ఉంది, అయితే ఇతర కళాశాలలు స్వల్పంగా మాత్రమే పెరుగుతాయి. ...