Hyderabad, మార్చి 15 -- రోజంతా పని ఒత్తిడి, శారీరక శ్రమ వల్ల రాత్రయ్యే సరికి బాగా అలసటగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు మంచం మీద పడుకోవడం వల్ల మనసుకు, శరీరానికి చాలా హాయిగా అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే హాయిగా, ప్రశాంతంగా, కంటికి సరిపడా నిద్రపోవడం చాలా ముఖ్యం. అయితే కేవలం సరిపడా నిద్రపోతే మాత్రమే చాలదనీ సరైన దిశలో నిద్రపోవడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. తప్పుడు దిశలో నిద్రపోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందట. మరి మీ ఏ దిశలో పడుకుంటారు? ఎలా పడుకోవడం వల్ల ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..

ఎడమ లేదా కుడివైపు పడుకుంటే శరీరానికి గాలి మార్గం తెరిచి ఉంటుంది. దీనివల్ల గొంతులో శబ్దం అంటే గురక సమస్య తగ్గుతుంది. స్లీప్ అప్నియా సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. పక్కకు తిరిగి పడుకోవడం వల్ల మెడ నొప్పి, వెన్ను నొప్పి వంటి స...