Hyderabad, ఏప్రిల్ 8 -- మన శరీరానికి విటమిన్ బి12 అత్యవసరం. విటమిన్ బి12 లోపం ఏర్పడితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మీ శరీరం ఎండిపోయినట్టు కర్రలాగా అవుతుంది. మీరు ఎన్ని ఆహారాలు తింటున్నా కూడా శరీరం ఆరోగ్యంగా కనిపించదు. దీనికి కారణం విటమిన్ బి12 లోపమే. దీన్ని కోబాలమిన్ అని పిలుస్తారు. కాబట్టి మీ శరీరం నిండుగా, చూడగానే ఆకట్టుకునేలా ఆరోగ్యంగా కనిపించాలంటే విటమిన్ బి12 ఉండే ఆహారాలను తినాల్సిన అవసరం ఉంది.

విటమిన్ బి12 లోపిస్తే మీరు తీవ్ర అలసట బారిన పడతారు. బలహీనంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. చేతులు, కాళ్లల్లో తిమ్మిరి పట్టడం, జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మం కూడా పసుపు రంగులోకి మారుతుంది. నాలుకలో నొప్పి లేదా వాపు కనిపిస్తుంది. బరువు తగ్గిపోతూ ఉంటారు. వికారంగా, వాంతులు వస్తున్నట్లు అన...