Hyderabad, మే 16 -- ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ప్రత్యేకమైనది. ఆ పెళ్లి రోజు కట్టే చీర లేదా లెహంగాలను దగ్గరుండి పెళ్లికూతుళ్ళే ఎంపిక చేసుకుంటారు. తమ వ్యక్తిగత ప్రాధాన్యతతోనే వాటిని ఎంచుకుంటారు. అయితే మీరు ఎంచుకున్న పెళ్లి చీర రంగును బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో అంచనా వేయొచ్చా అని చెబుతున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు.

రంగులు భావోద్వేగాలను రేకెత్తించడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. పెళ్లి సందర్భంలో మీరు ఎంచుకున్న చీర రంగు అనేక అర్థాలతో భావాలతో ముడిపడి ఉంటుంది. అయితే మీ పెళ్లి చీర రంగును బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

ఎరుపు చీరను ఎంచుకునే వారి సంఖ్య ఎక్కువే. ఎరుపును హిందూ సంప్రదాయ రంగుగా చెప్పుకుంటారు. ఇది ప్రేమ, అభిరుచిని సూచిస్తుంది. అంతేకాదు ఇది ఒక ప్రకాశవంతమైన రంగు. ధైర్యంగా ఉండే వధువులు ఎక్కువగా ఎరుపు రంగు చీరను ఎంపిక చే...