Hyderabad, ఆగస్టు 20 -- కమెడియన్, హోస్ట్ అయిన భారతి సింగ్ ఒక దశాబ్దానికి పైగా తన షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆమె ఇటీవల రాజ్ శమనీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. అక్కడ ఆమె పరిశ్రమలో తన ప్రయాణం గురించి మాట్లాడారు. ఆ షోలో తాను ఎన్నో ఇబ్బందులు పడుతున్న రోజుల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. తనను ఎంతో మంది అసభ్యంగా తాకిన సందర్భాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపింది.

కమెడియన్ గా భారతీ సింగ్ మంచి పేరు సంపాదించింది. హోస్ట్ గానూ టీవీ షోలలో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. అలాంటి సెలబ్రిటీకి కూడా ఒకప్పుడు వేధింపులు తప్పలేదు. ఒకప్పుడు తాను ఎదుర్కొన్న అసభ్యకర ప్రవర్తన గురించి ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఆ ఇంటర్వ్యూలో భారతి మాట్లాడుతూ.. "ఈ రోజు మనకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్ గురించి తెలుసు. కానీ అప్ప...