Hyderabad, మే 6 -- మీ ముఖం కడుక్కున్న కాసేపటికే జిడ్డుగా తయారవుతుందా? ముఖంపై పేరుకుపోయిన నూనె మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? బాధపడండి, ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ల అందరిదీ ఇదే బాధ. నిజానికి మన చర్మంలో ఉండే చిన్న నూనె గ్రంథులు అతిగా పనిచేయడం వల్లనే ఈ సమస్య వస్తుంది. నూనె ఉత్పత్తి ఎక్కువ అవడం వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్ లాంటివి వచ్చి విసిగిస్తుంటాయి. చెడుతోపాటు మంచి, మంచితో పాటు చెడు అన్నట్లు ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్యలు మాత్రమే కాదు కొన్ని లాభాలు కూడా ఉన్నాయట. మీది కూడా ఆయిలీ స్కిన్ అయితే మీరు తెలుసుకోవాల్సిన మరో మంచి విషయం ఒకటి ఉంది.

అదేంటంటే.. జిడ్డు చర్మం గలవారి చర్మం త్వరగా ముడతలు పడదట. అంటే వీళ్లు ఎక్కువ కాలం యవ్వనంగా కనిపస్తారన్న మాట. ఇదొక్కటే కాదు ఆయిలీ స్కిన్ గురించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. వీటిలో వాస్తవాలు కొన్ని ...