భారతదేశం, జూన్ 30 -- తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్‌గు గురిచేసింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికపై రాజాసింగ్ ఉదయం నుంచి అసంతృప్తిగానే ఉన్నారు.

నావాడు, నీవాడు అంటూ నియమిస్తే.. పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తాను నామినేషన్ వేయడానికి వెళ్లినట్టుగా చెప్పారు. దరఖాస్తు కూడా తీసుకున్నాను అని, జాతియ కౌన్సిల్ సభ్యులు మద్దతు ఇవ్వకుండా బెదిరించారని వెల్లడించారు. పార్టీలో ఉంటారా, సస్పెండ్ చేయాలా అని హెచ్చరించారన్నారు. తన దరఖాస్తుపై ముగ్గురు సభ్యులు సంతకం చేశారని, మరో ఏడుగురి సంతకం కావాల్సి ఉందని, అందుకే నామి...