భారతదేశం, జూన్ 21 -- మలయాళంలో అనేక థ్రిల్లర్లు విడుదలయ్యాయి. వాటి స్టోరీ లైన్, అందులో నటుల యాక్టింగ్ అదిరిపోయాయి. కొన్ని సినిమాలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కాగా.. మరికొన్ని ప్రేక్షకులను మొదటి నుండి చివరి వరకు ఉత్కంఠతో కూడిన థ్రిల్ ను అందిస్తాయి. ఓటీటీలో ఉన్న అలాంటి మలయాళం థ్రిల్లర్లను అస్సలు మిస్ కావొద్దు. అలా తప్పకుండా చూడాల్సిన మలయాళం థ్రిల్లర్లు ఇక్కడున్నాయి.

ఒక సీరియల్ కిల్లర్.. పోలీసు అధికారులను దారుణంగా చంపుతుంటాడు. హంతకుణ్ని పట్టుకోవడానికి ఒక కన్సల్టింగ్ క్రిమినాలజిస్ట్ అయిన అన్వర్ విచారణ బృందంలో చేరుతాడు. విచారణ జరిగే కొద్దీ, ఈ కేసు అపరాధి కుటుంబానికి జరిగిన అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకోవడం గురించి హత్యలు చేస్తున్నాడని స్పష్టమవుతుంది. మిధున్ మాన్యుయల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలో నటించాడ...