భారతదేశం, జూన్ 29 -- బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ కు ముందు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఈ సీజన్ లో సెలబ్రిటీలతో పాటు మనమూ అంటే కామన్ పీపుల్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ సీజన్ కు సంబంధించిన క్యాస్టింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. షో చరిత్రలోనే తొలిసారిగా సెలబ్రిటీలతో పాటు సామాన్యులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయనున్నట్లు హోస్ట్ నాగార్జున ఆదివారం ప్రకటించారు.

బిగ్ బాస్ 9 ప్రమోషనల్ వీడియోలో నాగార్జున మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకు బిగ్ బాస్ అంటే మీకు చాలా ఇష్టం. కాబట్టి, మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఇష్టపడే బిగ్ బాస్ హౌస్ లోకి మిమ్మల్ని అనుమతించడం మీ రిటర్న్ గిఫ్ట్. ఈ సారి సెలబ్రిటీలే కాదు మీరు కూడా ఈ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. కాబట్టి రండి.. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ మీ కోసం వేచి ఉంది'' అ...