Hyderabad, మే 8 -- ప్రీడయాబెటిస్ అనేది ఒక ముందస్తు వార్నింగ్ అని చెప్పుకోవాలి. డయాబెటిస్ రావడానికి సిద్ధంగా ఉందని చెప్పే హెచ్చరిక సంకేతమే అది. ప్రీడయాబెటిస్ ఉన్నవారు పూర్తి డయాబెటిస్ పేషెంట్‌గా మారకముందే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కేవలం మూడు నెలల్లో ప్రీడయాబెటిస్ రోగులు అ వ్యాధిని తగ్గించుకొని ఆరోగ్యంగా జీవించవచ్చు.

ప్రీ డయాబెటిస్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కన్నా ఎక్కువ ఉన్నాయని చెప్పే ఆరోగ్య పరిస్థితి. మీ శరీరం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా ప్రాసెస్ చేయలేకపోతుందని కూడా చెప్పడమే దీని ఉద్దేశం. అలాగే ఇన్సులిన్ నిరోధకత ఉందని కూడా ప్రీ డయాబెటిస్ చెప్పకనే చెబుతోంది. ప్రీడయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.

ప్రీడయాబెటిస్‌తో బాధపడే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. జీవనశైలిలో మార్పులు...