భారతదేశం, ఆగస్టు 15 -- ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన నియమాలలో పెద్ద మార్పు చేసింది. ఇది ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది. మీకు పీఎఫ్ ఖాతా ఉంటే.. ఈ సమాచారం మీకు చాలా అవసరమైనది. ఇప్పటి నుండి మీరు ఉద్యోగాలు మారితే మీకు కొత్త యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) లభించదు. మీ పాత యూఏఎన్ మీ ఉద్యోగ జీవితాంతం పనిచేస్తుంది.

దీనితో పాటు ఇప్పుడు ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ అంటే FAT లేకుండా యూఏఎన్ జారీ అవ్వదు. ఉద్యోగుల పనిని సులభతరం చేయడానికి, మోసాన్ని నిరోధించడానికి ఈ నియమాలు తీసుకువచ్చారు.

మీరు కొత్తగా ఉద్యోగంలో చేరితే ఇకపై ఒక పనిచేయాల్సి ఉంటుంది. గతంలో ఆధార్ లేదా KYC మాత్రమే సరిపోయేది. కానీ ఇప్పుడు UANని రూపొందించడానికి, మీ ముఖం ఉమాంగ్ యాప్ ద్వారా స్కాన్ అవుతుంది. ఈ స్కాన్ సిస్టమ్‌లో రికార్డ్ అవుతుంది. తద్వారా నకిలీ ఖాతా క్రియేట్ అవ్వదు. పీఎఫ్ ...