భారతదేశం, డిసెంబర్ 23 -- దురంధర్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసిందా? రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు లేటు. ఈ హాలీడే సీజన్ లో ఓటీటీలోని ఇలాంటి స్పై థ్రిల్లర్లు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఈ 8 సినిమాలు, సిరీస్ లు చూసేయండి.

జియోహాట్ స్టార్ ఒరిజినల్ వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్. ఇది పక్కా స్పై థ్రిల్లర్. ఉగ్రవాదుల దాడి వెనుక ఉన్న వాళ్లను కనిపెట్టే ఆపరేషన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇది ఓటీటీలో అదరగొడుతోంది. నీరజ్ పాండే రూపొందించిన భారతీయ గూఢచారి థ్రిల్లర్ సిరీస్ ఇది. దాదాపు రెండు దశాబ్దాలుగా జరిగిన అనేక ఉగ్రవాద దాడుల వెనుక ఒకే మాస్టర్ మైండ్ ఉందని నమ్మిన భారతదేశపు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW) నుండి వచ్చిన అనుభవజ్ఞుడైన ఏజెంట్ హిమ్మత్ సింగ్ పై ఈ కథనం కేంద్రీకృతమై ఉంది.

రాజీ అనేది ప్...