Hyderabad, ఏప్రిల్ 26 -- స్నానం చేయడం భారతదేశ సంప్రదాయం ప్రకారం రోజువారీ జీవితంలో సాధారణ భాగం. శరీరాన్ని శుభ్రం చేయడమే కాకుండా కొత్త ఎనర్జీని అందిస్తుంది. అయితే, శరీరంపై నీరు పోసుకున్నామా, కాసేపు సబ్బుతో రుద్దుకున్నామా అంటే స్నానం అయిపోదు. చాలా మంది చేసే పొరపాటు ఇదే. వందలో దాదాపు 90శాతం మంది స్నానం చేసేటప్పుడు కొన్ని శరీర భాగాలను శుభ్రం చేయకుండా వదిలేస్తారట. ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. శరీరంలోని అతి ముఖ్యమైన, బ్యాక్టీరియా కలిగి ఉండే ప్రదేశాలను ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తుంది.

నిజానికి స్నానం అంటే శరీరంలో పేరుకుపోయిన మురికి, చెమట, బ్యాక్టీరియాను తొలగించడానికి, అన్ని భాగాలను బాగా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. శరీరంలో కొన్ని భాగాలలో చెమట, బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. స్నానం చేసేటప్పుడు ఈ భాగాలను నిర్లక్ష్యం చేస్తే, దుర్వాస...