Hyderabad, మార్చి 25 -- చాణక్యుడిని అపర మేధావిగా చెబుతారు. ఆయన అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపించగలరని అంటారు. భారతదేశ చరిత్రలో చాలామంది గొప్ప పండితుల్లో ఈయన కూడా ఒకరు. ఈయన విలువ నేటికి ప్రజల్లో అలాగే ఉంది. ఆయన చెప్పిన పాఠాలను, బోధనలను ఇప్పటికీ ప్రజలు అనుసరిస్తూనే ఉంటారు. మన జీవితంలోని ప్రతి అంశం గురించి ఆయనకు అద్భుతమైన జ్ఞానం ఉందని నమ్ముతారు. ఆ జ్ఞానాన్ని ఆయన పుస్తకం రూపంలో పంచుకున్నారని అంటారు. వాటిని చాణక్య నీతిగా పిలుచుకుంటారు.

ఒక వ్యక్తికి ఎలాంటి అలవాట్లు ఉంటే అతడు పెద్దయ్యాక విజయ శిఖరాలను చేరుకుంటాడో, ధనవంతుడిగా మారతారో అపర చాణక్యుడు ఏ రోజో చెప్పాడు. ఆ అలవాట్లు మీకు ఉన్నాయో లేవో తెలుసుకోండి.

ఏ వ్యక్తికైతే సమయం విలువ తెలుస్తుందో... అతడు కచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు. ఆ విజయంతో పాటు ధనవంతుడిగా కూడా మారుతాడు. అతని పురోగతిని ఎవ...