Hyderabad, మే 24 -- చాలా మందికి ఒక అభిమాన జంతువు ఉంటుంది. అది కేవలం చూడటానికి బాగుందని మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఆ జంతువుల లక్షణాలను బట్టి కూడా అది మన ఫేవరెట్ జంతువుగా మారుతుంది. అంతేకాదు చాలా సార్లు ఆ జంతువుకున్న లక్షణాలు కూడా మన స్వభావానికి దగ్గరగా ఉంటాయని అందుకే అది మన అభిమాన జంతువుగా మనం ఫీలవుతామని మీకు తెలుసా? దీని ఆధారంగా మీకు ఇష్టమైన జంతువును బట్టి మీ వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయచ్చట.

ఉదాహరణకు కొన్ని జంతువులు చాలా స్నేహంగా ఉంటాయి, మరికొన్ని స్వతంత్రంగా ఉండటాన్ని ఇష్టపడతాయి. మీకిష్టమైన జంతువు కుక్క, పిల్లి, కోతి, లేదా కుందేలు వంటివి అయితే అవి మీలోని ఏ లక్షణాలను చూపిస్తుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇవి కేవలం సరదా అంచనాలే అయినా, మీ గురించి మీరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇదొక మంచి మార్గం. లేటు ఎందుకు మరి మీకు ఇష్...