Hyderabad,telangana, మే 31 -- హైదరాబాద్‌ లోని హైటెక్స్ వేదికగా ప్రపంచ సుందరి-2025 ఫైనల్‌ పోటీలు జరుగుతున్నాయి. అయితే చివరి రౌండ్‌లో అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేయనున్నారు. అయితే ఆసియా నుంచి రేసులో ఉన్న మిస్ ఇండియా నందిని గుప్తా నిష్క్రమించారు. టాప్ 8లో చోటు దక్కించుకుపోవటంతో పోటీ నుంచి తప్పుకున్నట్లు అయింది.

మిస్ వరల్డ్ ఫైనల్ పోటీల వివరాల చూస్తే.. ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేశారు. అమెరికా ఖండం నుంచి మార్టినిక్, ఆఫ్రికా నుంచి ఇథియోపియా, యూరోప్ నుంచి పోలెండ్, ఆసియా నుంచి.. థాయిలాండ్ దేశాలు కంటెస్టెంట్లు నిలిచారు.

మిస్ వరల్డ్ లో ఫైనల్ రౌండ్ లో జడ్జ్ లు అడిగే ప్రశ్నలకు కంటెస్టెంట్ ల సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి మార్కుల ఆధారంగా విజేతను ప్రకటిస్తారు.నువ్వు ...