భారతదేశం, మే 19 -- హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ మిషన్ ఇంపాజిబుల్ సినిమాలకు ఇండియాలో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ లో టామ్ క్రూజ్ స్టంట్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. యాక్షన్ లవర్స్ కు ట్రీట్ లాంటి ఈ ఫ్రాంఛైజీలో చివరి సినిమాగా 'మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్' థియేటర్లకు వచ్చేసింది. వస్తూనే ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల రికార్డు కొనసాగిస్తోంది.

ఇంకా అమెరికాలో రిలీజ్ కాని 'మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్' మూవీ ముందుగా ఇండియాలోకి వచ్చేసింది. శనివారం (మే 17) థియేటర్లలో రిలీజైన ఈ టామ్ క్రూజ్ యాక్షన్ మూవీ వీకెండ్ లో అదుర్స్ అనిపించింది. రెండు రోజుల్లో ఈ మిషన్ ఇంపాజిబుల్ 8 సినిమా రూ.33 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది.

టామ్ క్రూజ్ సినిమా అది కూడా మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంఛైజీ...