భారతదేశం, జనవరి 8 -- నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ కేసు గురించి జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం తాజాగా బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్, రూ.25 వేలకు రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.

ప్రణయ్ హత్య కేసులో గతంలో అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. శ్రవణ్ జీవిత ఖైదును సవాల్ చేస్తూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ ముగిసేవరకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. తెలంగాణ హైకోర్టు శ్రవణ్ వయసు, జైలు జీవితాన్ని దృష్టి పెట్టుకుని బెయిల్ మంజూరు చేసింది.

పెరుమాళ్ల ప్రణయ్, అమృత వర్షిణి పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా 2018లో వి...