భారతదేశం, సెప్టెంబర్ 13 -- తెలుగు సినిమాలో ఇది సీక్వెల్స్ సీజన్. ఈ శుక్రవారం విడుదలైన 'మిరాయ్' కూడా అందుకు భిన్నం కాదు. తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి కూడా సీక్వెల్ రానుంది. కార్తీక్ ఘట్టమనేని చిత్రంలో సీక్వెల్ కథను సెట్ చేసే మిడ్-క్రెడిట్ సీన్ ఒకటి ఉంది. ఇప్పుడు దీని గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

మిరాయ్ మూవీలో సూపర్ యోధాగా తేజ సజ్జా, బ్లాక్ స్టార్డ్ అనే విలన్ గా మంచు మనోజ్ నటించారు. అశోకుడి 9 గ్రంథాలను సొంతం చేసుకుని, ఆ శక్తితో ప్రపంచాన్ని నాశనం చేయాలని మహాబీర్ లామా అలియాస్ బ్లాక్ స్వోర్డ్ (మనోజ్) అనుకుంటాడు. అతణ్ని మిరాయ్ అనే ఆయుధంతో వేద (తేజ) ఓడించడంతో మిరాయ్ మూవీకి ఎండ్ కార్ట్స్ పడతాయి.

మిరాయ్ మూవీ మిడ్-క్రెడిట్ సన్నివేశంలో సీక్వెల్ టైటిల్‌ను ప్రకటించడంతో పాటు కొత్త విలన్ ...