భారతదేశం, నవంబర్ 13 -- హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మిదానీ నుంచి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2025 ఏడాదికి సంబంధించి పలు విభాగాల్లో ఐటీఐ ట్రేడ్‌, టెక్నీషియన్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. https://midhani-india.in/ వెబ్ సైట్ లో నోటిఫికేషన్లతో పాటు అప్లికేషన్ ఫారమ్ ను కూడా అందుబాటులో ఉంచారు.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌, టెక్నీషియన్‌ డిప్లొమా అప్రెంటిస్‌. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ లు కలిపి మొత్తం 210 ఖాళీలున్నాయి. వీటిలో అత్యధికంగా ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు 160గా ఉన్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. విద్యార్హతల్లోని మార్కులతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్రెంటిస్ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు స్టైఫండ్...