భారతదేశం, డిసెంబర్ 4 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకు వస్తుంది. కొన్ని సార్లు గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతుంది. అది కూడా శుభ ఫలితాలను తీసుకొస్తూ ఉంటుంది. గురువు, చంద్రుడు రెండూ కూడా శక్తివంతమైనవి. ఈ రెండు గ్రహాలు సంయోగం జరిగినప్పుడు అద్భుతమైన యోగం ఏర్పడుతుంది. ఇది ద్వాదశ రాశి వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది.

ఇప్పుడు అటువంటి అద్భుతమైన యోగం రాబోతోంది. ఈ యోగం ఏర్పడడంతో అనేక రాశుల వారికి లాభాలు కలిగే అవకాశం ఉంది. డిసెంబర్ 4న గురువు కర్కాటకం నుంచి మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు డిసెంబర్ 5న మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఈ రెండు గ్రహాలు మిధున రాశిలోకి రావడంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి రాజయోగం చాలా శక్తివంతమ...