Hyderabad, ఆగస్టు 4 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. కొన్నిసార్లు గ్రహాలు ఇతర గ్రహాలతో సంయోగం చెందుతూ ఉంటాయి. ఆ సమయంలో కూడా ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. గ్రహాలు కాలనుగుణంగా నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి. అప్పుడు కూడా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

మిథున రాశిలో గురువు, శుక్రుడు, చంద్రుడు సంయోగం చెందుతారు. దాంతో కొన్ని రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలవుతాయి. పంచాంగం ప్రకారం చూసినట్లయితే ప్రస్తుతం గురువు, శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు. గురు గ్రహం ఒక రాశిలో 12 నెలలపాటు సంచారం చేస్తుంది. శుక్రుడు 23 రోజుల నుంచి 60 రోజులు వరకు ఒక రాశిలో సంచారం చేస్తాడు.

ఆగస్టు 18న చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 20 దాకా ఇదే రాశిలో ఉంటాడు. ఈ మూడు గ్రహాలు మ...